Supreme Court: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పై అత్యాచారం, హత్య దారుణ ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
మరోపక్క ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటన గురించి విచారణ చేపట్టేందుకు రెడీ అయ్యింది. ఈ కేసును టాప్ ప్రయారిటీ కేసుగా చేపట్టిన సుప్రీం కోర్టు. ఇస్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించిన కోల్‌కతా హైకోర్టు.
ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీం కోర్టు ఏం తీర్పు చెప్పబోతోందన్న దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా ఐదో రోజు సీబీఐ విచారించనుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు లై డిటెక్టర్ టెస్ట్ ను పోలీసు అధికారులు నిర్వహించనున్నారు.
జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును విచారణ చేపట్టనుంది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీం కోర్టు విచారణకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ దారుణ ఘటనలో కాలేజీ యజామాన్యంతో పాటు పెద్ద తలకాయల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు!