Kokapet Land Auction :భూముల వేలంలో కోకాపేట భూములు కేక పుట్టించాయి. ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్ కేకుల్ల ప్లాట్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. గురువారం రెండో విడత కింద భూముల వేలం చేపట్టింది HMDA. ఈ వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100కోట్లకు పైగానే పలికింది. ప్లాన్ నెంబర్ 10కి ఎకరానికి 100కోట్ల బిడ్ దాఖలైంది.
గురువారం సాయంత్రం వరకు 18.47 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. నియోపోలీస్ లోని 9, 10,11,14 ప్లాట్లకు ఈ వేలం కొసాగింది. మొత్తం 45ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లతో రూ. 3,319వేల కోట్లను ఆర్జించింది హెచ్ఎండీఏ. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ. 35కోట్లుగా ఉంది.
Kokapet Land Auction: గతంలో 2021 జులైలో నియోపోలీస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60కోట్లు పలికింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వంరూ. 2000కోట్లు సంపాదించింది. ఫేజ్ 1లో దాదాపు 49 ఎకరాలను విక్రయించింది. ఎకరం అప్ సెట్ ధరను 25కోట్లుగా నిర్ణయించారు. అయితే రెండో విడత విక్రయాల ద్వారా కూడా ఆదాయం భారీ మొత్తంలోనే వచ్చింది. గురువారం జరిగిన వేలంలో 3,319వేల కోట్లను ఆర్జించింది. ఇక నియోపోలీస్(Neopolis) తోపాటు గోల్డెన్ మైల్ పేరుతో డెవలప్ చేసిన లేఅవుట్లలో భూముల కొనుగోలుకు విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం ధరలు రావని..కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరనే అభిప్రాయం ఉంది. జీవో 111 ప్రభావంతో రెండో విడత ఈ వేలానికి పెద్దగా ఆసక్తి చూపరనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ వాటిని తలకిందులు చేస్తూ...ఏకంగా 35వేల కోట్ల ఆదాయం సమకూరింది.
Also Read: హైదరాబాద్ భూముల ధరలు.. తెలంగాణ పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్