Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు! ఎందుకు పనికిరాని, దేనికి తేడా తెలియని లోకేష్ ని గెలిపిస్తే మాత్రం టీడీపీ నుంచి తారక్ ని బయటకు పంపి టీడీపీని ఆక్రమించుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారని కొడాలి నాని ఆరోపించారు. పేదల పాలిట వరంగా మారిన వైసీపీని మరోసారి గెలిపించుకోవాలని నాని కోరారు. By Bhavana 06 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Ap Politics : ఏపీ రాజకీయాల గురించి వైసీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టిన రోజుకి, చావుకి తెలియని ఓ ముద్దపప్పును ముఖ్యమంత్రి చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ను టీడీపీ(TDP) నుంచి బయటకు గెంటేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ శాశ్వతంగా దూరం అవుతారని అన్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల నుంచి తప్పించడానికి ఎన్నో కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో కానీ, సినిమాల విషయంలో కానీ సీనియర్ ఎన్టీఆర్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానించే ప్రతి ఒక్కరు టీడీపీని ఓడించి వారికి బహుమతిగా ఇవ్వాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు అందుకుంటారని ఆయన అన్నారు. ఎందుకు పనికిరాని, దేనికి తేడా తెలియని లోకేష్ ని గెలిపిస్తే మాత్రం తారక్ ని బయటకు పంపి టీడీపీని ఆక్రమించుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారని ఆయన ఆరోపించారు. పేద ప్రజల పాలిట వరంగా మారిన వైసీపీ(YCP) ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలంటే రెండుసార్లు ఈవీఎం బటన్ నొక్కాలని నాని తెలిపారు. రాష్ట్రానికి పట్టిన చంద్రముఖి అనే దెయ్యాన్ని ఈసారి ఈవీఎంల్లోనే బంధిస్తే చంద్రబాబు(Chandrababu) అనే పేరు శాశ్వతంగా అంతరించిపోతుందని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు మంగళగిరిలో జరిగిన సభలో నాని ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read : తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత! #ycp #tdp #politics #jr-ntr #kodali-nani #movies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి