Gudivada : మానవత్వం, కనికరం లేని క్రూరుడు.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

ఈ రోజు దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. కోటి 43 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మానవత్వం, కనికరం లేని క్రూరుడంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలన్నారు.

Gudivada : మానవత్వం, కనికరం లేని క్రూరుడు.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
New Update

Vijayawada: గుడివాడ రూరల్ మండలం దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali nani) ఈ రోజు పర్యటించారు. దొండపాడు(Dondapaadu) గ్రామంలో కోటి 43 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన త్రాగునీటి ప్రాజెక్ట్ లను ప్రజా ప్రతినిధులతో కలిసి, ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత దొండపాడు గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికు పార్టీ నేతలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులు, గ్రామస్తులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే నానికు మంగళహారతులు ఇస్తు, పులవర్షం కురిపిస్తూ వీధివీధినా మహిళలు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికగా, దారి పొడువునా ఎమ్మెల్యే నానితో సెల్ఫీలు దిగుతు, కరచాలనం చేసేందుకు యువత పోటీ పడ్డారు.

త్రాగునీటి ప్రాజెక్ట్ లు ప్రారంభం..
ఈ క్రమంలో ముందుగా రూ. 47.75లక్షల నిధులతో దొండపాడు శివారు(SCL) నందు అభివృద్ధి పరిచిన త్రాగునీటి మౌలిక వసతులు, ఇంటింటికి త్రాగునీటి ట్యాప్ కనెక్షన్లను మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, ఎంపీపీ గద్దె పుష్పరాణిల చేత ఎమ్మెల్యే నాని ప్రారంభోత్సవం చేయించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ర్యాలీగా దొండపాడు తాగునీటి వాటర్ వర్క్స్ వద్ద రూ.95.72 లక్షలనిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకర్, నూతన వాటర్ పైప్ లైన్ కనెక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని గ్రామస్తులకు త్రాగునీరు విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : Dubai: భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ప్రసంగం

చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలి..
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడం, ఆరోగ్య భద్రత కల్పించడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా సీఎం జగన్ వెనకడుగు వేయ్యాలేదన్నారు. ఎన్నికల ఫలితాల్లో గ్రామాల్లో ప్లస్ వచ్చిందా, లేక మైనస్ వచ్చిందా అని చూడకుండా గ్రామాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ప్రజలు కూడా కుల, మతాలు, చూడకుండా జగన్ కు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.1999 నుండి చంద్రబాబు ప్రకటిస్తున్న మేనిఫెస్టో అంశాల్లో 10 శాతం కూడా నెరవేర్చని మోసకారి అని విమర్శించారు. నేడు పర్యటనలో తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నేను మంచి చేశానని భావిస్తేనే ఓట్లు వేయండి అంటూ మీ ముందుకు వస్తున్న సీఎం జగన్ కు మద్దతుగా, ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభా వేదికపై పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు ప్రజల శ్రేయస్సుకు సీఎం జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె పుష్పరాణి, జడ్పిటిసి గొళ్ళ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు , నందివాడ ఎంపీపీ పేయ్యల ఆదాం, వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ మేకల సత్యనారాయణ, మండల వైఎస్ఆర్సిపి నాయకులు పొట్లూరి మురళీధర్, గద్దె రాము, గుడివాడ రవిబాబు, బొడ్డు రమేష్, సర్పంచ్ దుంపల వెంకమ్మ, మెరుగుమాల వెంకటేశ్వరరావు, గంటా సురేష్, గిరి బాబాయ్, కారే జోసెఫ్,రేమల్లి నిలాకాంత్ , అల్లం రామ్మోహన్రావు, రేమల్లి నీలాకాంత్, ఆర్కె, ఎండిఓ జ్యోతి,పలు ప్రభుత్వ శాఖల అధికారులు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

#ycp #jagan #kodali-nani #chendrababu #dondapadu #drinking-water-project-started
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe