BJP : ధృవ్ రాఠీ(Dhruv Rathee) కొన్ని వారాలుగా ట్విట్టర్(X) లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు(Supreme Court) ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) ను కొట్టివేసిన వెంటనే అతను ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఇది పెను ప్రకంపనలు సృష్టించింది. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ ఎలా స్కామ్ చేసిందో వివరిస్తూ ధృవ్ రాఠీ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. మీడియా ఏకపక్షంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్న కాలంలో ధృవ్ రాఠీ చేస్తున్న వీడియోలు ఓ సెక్షన్‌కు ఫేవరెట్‌గా మారాయి. బీజేపీ ప్రత్యర్థుల రాజకీయ ప్రసంగాల కంటే యూట్యూబ్‌లో ధృవ్ వీడియోలు హిందీ-బెల్ట్ రాష్ట్రాల్లోని పట్టణాలలో వైరల్ అవుతున్నాయి. 29 ఏళ్ల యువకుడు 'భారతదేశం నియంతృత్వంగా మారుతోందా?' అనే శీర్షికతో రూపొందించిన అరగంట వ్లాగ్ సంచలనం రేపింది. ఈ వీడియోలో ధృవ్ ఎన్నికల సంఘం(Election Commission) పని తీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. భారతదేశ ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితిని కూడా అతను నిలదీశారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్..
29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. అతను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. అతనకు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. డిజిటల్ స్పేస్‌లో దాదాపు అందరికి తెలిసిన వాయిస్ తెలిసిన వాయిస్‌గా ధృవ్ రాఠీది. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.
బెర్లిన్ ఉంటున్న ధ్రువ్..
హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించిన ధృవ్ రాఠీ తన స్కూల్ విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, RK పురంలో చదివాడు. హైస్కూల్ చదువును పూర్తి చేసిన తర్వాత జర్మనీలోని ఓ ఇన్‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ చదివాడు. ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. జర్మనీ పౌరుడైన జూలీను వివాహం చేసుకున్న ధృవ్ రాఠీ జర్మనీలోని బెర్లిన్‌లో నివసిస్తున్నాడు.
ధ్రువ్ యూట్యూబ్ కెరీర్..
ధృవ్ రాఠీ తన ట్రావెల్ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ 2013లో తన యూట్యూబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే వెంటనే రాజకీయ, సామాజిక అంశాలను కవర్ చేయడం స్టార్ట్ చేశాడు.యూట్యూబ్‌ను రాజకీయ వేదికగా ఉపయోగించిన మొదటి భారతీయ వినియోగదారులలో రాఠీ కూడా ఒకరు. 2023లో ధృవ్ రాఠీ యూట్యూబ్ డైమండ్ ప్లే బటన్‌ను అందుకున్నాడు. T- సిరీస్, ప్యూడీ పై, మిస్టర్ బీస్ట్ లాంటి ప్రసిద్ధ యూట్యూబర్‌ల జాబితాలో చేరాడు. ధృవ్ రాఠీ దేశంలో అత్యధికంగా చెల్లించే యూట్యూబర్‌లలో ఒకరు. జాగ్రన్ వెబ్‌సైట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ధృవ్ రాతీ నికర విలువ రూ. 27 కోట్లు. అతని నెలవారీ ఆదాయం దాదాపు రూ.48 లక్షలు. 2023లో టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన తదుపరి తరం నాయకుల జాబితాలో ధృవ్ రాఠీ ఉన్నారు.