No Ants In The Country : భూమీ(Earth) పై దాదాపు మీరు ప్రతిచోటా చీమలను చూస్తారు. ప్రపంచంలో చాలా రకాల చీమలు(Ants) కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనిషి ప్రాణానికి ఎలాంటి ముప్పు కలిగించవు.. జస్ట్ కుట్టేసి.. చర్మాన్ని ఎర్రగా కందేలా చేసి వెళ్లిపోతాయి. అయితే కొన్ని చీమలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఈ భూమిపై 12 వేల కంటే ఎక్కువ జాతుల చీమలు నివసిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా నలుపు, గోధుమ, ఎరుపు రంగు చీమలు ఉంటాయి. ఆఫ్రికా(Africa) లో, కొన్ని చీమలు చాలా ప్రాణాంతకంగా ఉంటాయి. అవి కాటు తర్వాత ఒక వ్యక్తి ఒక క్షణంలో కూడా చనిపోవచ్చు. అయితే ప్రపంచంలో ఒక్క చీమ కూడా లేని ప్రదేశం ఉందని మీకు తెలుసా? ఈ ప్రదేశం పేరు గ్రీన్‌ల్యాండ్. గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇక్కడ మీకు ఒక్క చీమ కూడా కనిపించదు.
చల్లగా ఉండడమే కారణం..
గ్రీన్‌ల్యాండ్ వాతావరణం(Greenland Climate) చాలా చల్లగా ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడి పర్యావరణ వ్యవస్థ చీమల మనుగడకు అనుకూలం కాదు. శాస్త్రవేత్తల ప్రకారం, చల్లని వాతావరణంలో చీమలు బతకలేవు. ఈ ద్వీపం భూమి ఉత్తర ధ్రువంలో ఉంది. దీని కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. భూమి దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా అంటార్కిటికాలో కూడా చీమలు కనిపించవు.
ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది..
ప్రపంచం(World) లోనే అతిపెద్ద ద్వీప దేశమైన గ్రీన్‌ల్యాండ్ చాలా అందంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం మంచుతో కప్పబడింది. చాలా మంది తరచుగా గ్రీన్‌ల్యాండ్‌ను సందర్శించడానికి వెళతారు. రాజకీయంగా ఈ ప్రదేశం యూరప్‌కు చెందినది.. కానీ భౌగోళికంగా ఈ ప్రదేశం ఉత్తర అమెరికాలో భాగం. ఇక్కడ చల్లని వాతావరణంతో పాటు చీమలకు ఫుడ్ చైన్ లేదు. అందుకే అవి కనిపించవు.
Also Read : Rajasthan: మరీ ఇంత దారుణమా..అత్యాచార బాధితురాలికి కోర్టులో ఘోర అవమానం