KLH University: రికార్టు సృష్టించిన కేఎల్‌హెచ్‌ క్యాంపస్‌.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్

నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF)లో కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 6517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడగా.. తెలంగాణ నుంచి ఈ వర్సిటీ అత్యత్తమ ర్యాంక్ సాధించింది.

New Update
KLH University: రికార్టు సృష్టించిన కేఎల్‌హెచ్‌ క్యాంపస్‌.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్

కేఎల్‌హెచ్‌ హైదరాబాద్‌ యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. ఎన్‌ఐఆర్ఎఫ్‌ ర్యాంకింగ్‌లో జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించింది. తెలంగాణలో అత్యుత్తమ ర్యాంకింగ్ పొందిన ఘనతను కేఎల్‌ఎచ్‌ యూనివర్సిటీ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వర్సిటీ ఉప కులపతి డా. పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన విజయం సాధించడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. '' నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ - 2024(NIRF) లో కేఎల్‌హెచ్‌ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకుగాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యుత్తమ ర్యాంక్ ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలను కలిపి ప్రకటించిన ర్యాంకులలో కేఎల్‌హెచ్ యూనివర్సిటీ 22వ ర్యాంకు దక్కింది. ఇది అకడమిక్‌ ఎక్సలెన్స్, ఆవిష్కరణల పట్ల మా నిబద్ధను పునరుద్ఘాటించింది.

Also Read: హైడ్రా దూకుడు.. బీజేపీ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత

దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు మొత్తం కలిపి 6517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడ్డాయి. మా యూనివర్సిటీకి 22వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణ మొత్తం మీద తమ క్యాంపస్‌ అత్యుత్తమ ర్యాంకు దక్కించుకోవడం గర్వకారణమని'' అన్నారు. అలాగే వర్సిటీ ప్రిన్సిపాల్స్‌ డా. రామకృష్ణ, డా.కోటేశ్వర్‌రావు, అడ్మిషన్స్‌ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అజీజ్‌నగర్, బోరంపేట, కొండాపూర్‌ క్యాంపస్‌లలో అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

Also Read: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి

Advertisment
తాజా కథనాలు