వన్డే వరల్డ్ కప్ 2023 ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట ట్యాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ (80), కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో చెలరేగాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సౌద్ షకీల్ (53) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్ నిర్ణిత 50 ఓవర్లకు 5 వికెట్ల కోల్పోయి 345 పరుగులు భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ చెరో వికెట్ తీసుకన్నారు.
అనంతరం 346 పరుగులు భారీ లక్ష్య చేధనకు దిగిన కివీస్‌కు సరైన ఆరంభం దక్కలేదు. న్యూజిలాండ్ టీమ్ ఓపెనర్ వికెట్‌ను త్వరగానే కోల్పొయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర 97 పరుగులతో చెలరేగాడు. అతనితోపాటు చాప్‌మన్ 65, మిచెల్ 59, విలియమ్సన్ 54 హాఫ్ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ టీమ్ 43.4 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
మరోవైపు వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక బంగ్లాదేశ్‌లో మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించి అసలైన సమరానికి ముందే చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక టీమ్ 49.1 ఓవరలో 263 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 264 పరుగులు టార్గెట్‌తో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 42 ఓవర్లోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు. టాంజిద్ హసన్ 84, లిట్టన్ దాస్ 61, కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 67, ముష్ఫికర్ రహీమ్ 35 పరుగులతో రాణించారు.