BJP President Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, ఇచ్చిన హామీలు ఎక్కడంటూ.. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్లుగా రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగా ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సర్కారు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మిగిలిన 4 నెలల్లో అన్నీ హామీలను పూర్తిచేయాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. By Shareef Pasha 21 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి 2014, 2018 ఎన్నికల ప్రచారం (2024 Telangana Elections) సందర్భంలో ఎన్నికల ప్రణాళికల్లో, వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనూ అనేక సార్లు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలుచేయడం మరిచారని అన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలకు అతీగతీలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. మీ పదవీకాలం కొన్ని నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో మీరు హామీ ఇచ్చి అమలును మరిచిపోయిన వాటిని మరోసారి మీ దృష్టికి తీసుకొస్తూ, వాటిని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను.మీ హామీ రైతులకు మేలు చేయకపోవగా, కీడే ఎక్కువ చేసింది. యుద్ధప్రాతిపదికన ఏకమొత్తం లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, 2018 హామీ ఇచ్చి జాప్యం చేయడం వల్ల రైతులపై పడిన అదనపు వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలి. గిరిజనులకు చట్టపరమైన హక్కులు కల్పించాలి.. తెలంగాణలో అడవిని నమ్ముకొని జీవిస్తున్న(Podu Lands Issue) గిరిజనులు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా ఆయా భూముల్లో వ్యవసాయం చేస్తున్నా వీరికి వాటిపై చట్టపరమైన హక్కులు కల్పించలేదు. ఇటీవల ప్రభుత్వ భూములంటూ (Govt Lands) అటవీ అధికారులు వచ్చి వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా పేద గిరిజనులు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక, ఉప ఎన్నిక వచ్చినా పోడు భూములకు పట్టాలిస్తామని మీరు హామీ ఇస్తున్నారు, ఎన్నికలయ్యాక ఆ హామీని మరచిపోతున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులను గుర్తించి, తక్షణమే వారికి ఆ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాను. నిరుద్యోగులపై బీఆర్‌ఎస్ చిన్నచూపు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష వెనక నిరుద్యోగ సమస్య (unemployee issue)ఒక ప్రధాన కారణం. అయినప్పటికీ మీరు నియామకాలు చేపట్టకపోగా, కనీసం నిరుద్యోగ భృతి హామీని సైతం నెరవేర్చలేదు. 2018 ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3016 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా, బయటా నిరుద్యోగ భృతి హామీ ఇస్తూనే వచ్చారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుందని 2014 ఎన్నికల నుంచి అనేకసార్లు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో లక్షల మంది ఇల్లు లేని పేదలు సొంతింటి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ బాట.. తెలంగాణలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఎంతో మంది యువత సొంత ఊరు, ఇల్లు, కుటుంబాన్ని వదిలి జీవనాధారం కోసం గల్ఫ్ లో పని చేస్తున్నారు. ఇలా గల్ఫ్ బాట పట్టిన వారు లక్షల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ కు వెళ్లినవారు చాలామందే ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం NRI పాలసీ తీసుకొస్తుందని, వారి కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని, వారికి అవసరమైన సాయం అందించేందుకు సెక్రటేరియట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మీరు హామీ ఇచ్చిన మేరకు తక్షణమే (NRI)పాలసీ తీసుకొచ్చి, రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి, సెక్రటేరియట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. #brs #telangana #bjp #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి