Kishan Reddy : ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని మూడో సారి కూడా మోడీ(Modi) నే ప్రధాని మంత్రి కాబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈసారి ఎన్నికల్లో 350 కి పైగా సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్(Congress) హయాంలో ఏ పేపర్ చూసినా కుంభకుణాలే ఉండేవి. ఇప్పుడు మాత్రం దేశంలో జరుగుతున్న అభివృద్ది గురించి మాత్రమే కనపడుతుంది.
ప్రపంచంలోనే 5 వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది. మోడీ నాయకత్వంలో దేశం ఎంత ముందుకు వెళ్తుందో రోజు మనం చూస్తునే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల చరిత్రంలో మోడీ నేతృత్వంలో చంద్రమండలం పై అడుగు పెట్టామని కిషన్ రెడ్డి వివరించారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లోనే నేషనల్ హైవేస్ చాలా అద్బుతంగా వెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.
ఒకే కుటుంబం చేతిలో ఉండిపోవడంతో..
దేశంలో ట్రిపుల్ తలాక్(Triple Talak) తీసుకుని రావడం జరిగిందని వివరించారు. ఇన్ని సంవత్సరాలు కూడా తెలంగాణ(Telangana) ఒకే కుటుంబం చేతిలో ఉండిపోవడంతో అప్పుల పాలు అయ్యింది. కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ రూట్ మ్యాప్ లేకుండా పాలన కొనసాగిస్తుంది. కొత్త ప్రభుత్వానికి కూడా కొన్ని రోజులు గడువు ఇద్దామని కిషన్ రెడ్డి అన్నారు.
ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తుందో చూడాలన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతలు లేవు. గతంలో విద్యుత్ కోతలు ఉండేవి. ప్రస్తుతం భారత దేశం నుంచి సుమారు 150 దేశాలకు సెల్‌ఫోన్ ఎగుమతులు చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read : BREAKING: అఫ్ఘానిస్థాన్‌లో కూలిన భారత్ విమానం!
అత్యధిక సీట్లు గెలవాల్సిన అవసరం..
ఈసారి తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఫ్రంట్ ల పేరుతో ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తారు. అందరూ బీజేపీ(BJP) లో చేరి నరేంద్ర మోడీ(Narendra Modi) ని బలపరచాలి. ప్రస్తుతం బీజేపీ అవసరం భారతదేశంలో ఎంతో ఉంది. భారత దేశాన్ని బాబర్ రామ జన్మ భూమి ని ధ్వంసం చేశారు.
అయోధ్య(Ayodhya) రామమందిరం అనేది ఓ దేవాలయమో, కట్టడమో కాదు..భారతీయుని ఆత్మగౌరవానికి ప్రతీక. మొదటి సారి ప్రపంచంలో అత్యధిక ప్రజలు చూస్తున్న మొదటి కార్యక్రమం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం. ఓ గొప్ప టెక్నాలజీతో లైవ్ లో చూపించబోతున్న మొట్టమొదటి కార్యక్రమం ఈ అయోధ్య రామ మందిర ప్రారంభం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Also read: ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు!