Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి తొమ్మిది లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లను తొమ్మిదేళ్ళ కాలంలో ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళ్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి తొమ్మిది లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి
New Update

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక రైల్వే రంగంలో అత్యాధునిక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కోన్నారు. దేశంలో వందలాది రైల్‌వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. ఒకే రోజు తొమ్మిది రైళ్ళను ప్రారంభించిన ఘటన ప్రధాని మోదీ తక్కుతుందన్నారు. రవాణా రంగంలో దేశీయ టెక్నాలజీతో ముందుకుపోతున్నామన్నారు. దేశీయ టెక్నాలిజీతో వందే భారత్ ట్రైన్‌లను తయారు చేసుకుంటున్నాం ఆయన వివరించారు. తెలంగాణలో ఇప్పటికే రెండు వందే భారత్ ట్రైన్‌లు నడుస్తున్నాయి.. ఇది మూడోవది అన్నారు. సంక్రాంతి, ఉగాది పర్వదినాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు వందే భారత్ ట్రైన్‌లను ఇవ్వడం జరిగిందన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా మూడోవ ట్రైన్‌ను ప్రారంభిస్తున్ననoదుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజల తరుపున ప్రధాని మోదీకి, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రైల్వే టెర్మినల్ పనులు

12 జిల్లాల మీదుగా, మూడు రాష్ట్రాలను టచ్ చేస్తూ ఎనిమిదిన్నర గంటల్లో బెంగళూర్‌కు చేరుకుంటుందన్నారు. రెండు ఐటీ రంగంలో వేగంగా దూసుకుపోతున్న రెండు నగరాల మధ్య ట్రైన్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఈనెల 30, వచ్చే నెల 3న మోదీ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు.. కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని ఆయన తెలిపారు. రైల్వే అభివృద్ధికి రూ.4418 కోట్లను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి రూ.2500 కోట్లు మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లను ఆధునీకరించబోతున్నామన్నారు. చర్లపల్లిలో 220 కోట్లతో నూతన రైల్వే టెర్మినల్ పనులు జరుగుతున్నాయి.. త్వరలోనే మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని గుర్తు చేశారు.

హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతోంది

వరంగల్ రైల్వే కోచ్ పనులు వేగంగా జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో దక్షిణాదిలో రైల్వే నెట్‌వర్క్ అంశంలో నిర్లక్షం జరిగింది.. దాన్ని అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నo చేస్తోందన్నారు. వందే భారత్ ట్రైన్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మోదీ హయంలోనే లక్ష యాభై కోట్లతో రోడ్డు కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయి. RRR రింగ్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. RRR రోడ్డు పూర్తి అయితే హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతోందన్నారు. హైదరాబాద్ రాబోయే కాలంలో దేశంలో నెంబర్ వన్ అభివృద్ధి రాష్ట్రంగా నిలువబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లను తొమ్మిదేళ్ళ కాలంలో ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళ్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

#kishan-reddy #center #vande-bharat-train #telangana-development #nine-lakh-crore #kachiguda-railway-station
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe