Kishan Reddy On Phone Tapping: తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజూకు హీట్ ఎక్కుతుంది. ఇప్పటికే నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు అయితే.. తాజాగా మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్‌రెడ్డి ఫోలన్ ట్యాపింగ్‌పై మరోసారి ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని ఎవరు కావాలో ప్రజలందరూ ముందే నిర్ణయించుకున్నారన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని (PM Modi) కావాలని అన్నీ వర్గాల ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశంలో కనుచూపు మేరలో కూడా ఏ పార్టీ నాయకుడైన బీజేపీకి ప్రత్యర్థిగా పోటీలో లేరని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.
గ్యారంటీల పేరుతో ప్రజలని మోసం:
దేశ వ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు పక్కాగా వస్తాయని ఆయన దీమావ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న స్థానలను కూడా కోల్పోతుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ 90% సీట్లతో గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రజలని మోసం చేసిందని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ చెప్పలేని స్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అన్నట్లు ఉందన్నారు.
బీజేపీ గెలిచి ప్రధానికి బహుమతి ఇస్తాం:
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారలో ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదన్నారు. అనేక ప్రాంతాల్లో తాగునీతి ఏద్దడి.. విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ డబల్ డిజిట్‌లో పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటుంది, రైతులకోసం గిట్టుబాటు ధర, సబ్సిడీ, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, తెలంగాణలో 26వేల కోట్లు ధాన్యం కొనుగోలుకి కేంద్రం ఖర్చు చేస్తుంది, మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది.పేద ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆశుష్మాన్ భారత్ పేరుతో ఆరోగ్య భీమా కల్పించింది, చేతి వృత్తుల వారికోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ, యువకులకు ఉద్యోగ అవకాశలను కల్పిస్తుందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ సీటును కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఓవైసీకి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ రెండు సీట్లను బీజేపీ గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతి ఇస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో న్యాయ విచారణ కోసం కేంద్రాన్ని సహకారం కోరితే సహకరిస్తాం.. దోషులను కఠినంగా శిక్షిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు