Haryana: హర్యానాలో కాంగ్రెస్‌ కు పెద్ద షాక్‌..మాజీ సీఎం కోడలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా!

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనుండగా కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాకే తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Haryana: హర్యానాలో కాంగ్రెస్‌ కు పెద్ద షాక్‌..మాజీ సీఎం కోడలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా!
New Update

Haryana: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనుండగా కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాకే తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

కిరణ్‌ చౌదరి కూతురు శ్రుతి కూడా కమలం పార్టీలో చేరేందుకు రంగం రెడీ అయ్యింది. హర్యానా కాంగ్రెస్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లలో శ్రుతి ఒకరు. కిరణ్ చౌదరి మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు. శ్రుతికి లోక్ సభ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భివానీ - మహేంద్రగఢ్ పార్లమెంటరీ స్థానం తన కూతురు శ్రుతికి ఇవ్వాలని కిరణ్ చౌదరి పార్టీ పెద్దలను డిమాండ్‌ చేశారు.

కానీ పార్టీ అందుకు నిరాకరించింది. ఈ కారణంగానే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. కిరణ్ చౌదరి తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. హర్యానాలో అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరణ్‌ చౌదరి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

Also read: వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే!

#congress #bjp #haryana #kiran-coudary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe