Pooja Hegde At Mumbai Juhu Beach : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా కాలం తరువాత బయటికొచ్చింది. అది కూడా బీచ్ లో చెత్త ఏరుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అమ్మడు క్లీనింగ్ ప్రోగ్రాం లో పాల్గొంది. ఈ ప్రోగ్రాం లో తనవంతు బాధ్యతను నిర్వర్తించింది. శనివారం ముంబై లోని జుహూ బీచ్ లో నిర్వహించిన క్లీనింగ్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసిన పూజా హెగ్డే బీచ్ లో చెత్త ఎత్తింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ బుట్టబొమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రెజెంట్ పెద్దగా మూవీ ఆఫర్స్ లేకుండా ముంబై లో ఖాళీ సమయాన్ని గడుపుతున్న పూజా హెగ్డే ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ లో పాల్గొంటుంది.
Also Read : సినిమా చూడకుండా ఉదయం ఆరు గంటలకే రివ్యూలు రాశారు.. సినీ క్రిటిక్స్ పై విశ్వక్ సేన్ ఫైర్!
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే నటించిన ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అయినా కూడా బాలీవుడ్ లో పూజా హెగ్డేకి ఆఫర్స్ తగ్గడం లేదు. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో కలిసి 'దేవ' అనే సినిమాలో నటిస్తోంది. అటు సౌత్ లో తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య 44 వ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
"Yeh Dekho Kya ho gaya" says #PoojaHegde looking beautiful in a white 🤍 crop top and a blue 💙 pair of jeans as she talks to the paps 📸 and attends a beach cleanup drive ⛱️☀️ in Mumbai 📍 She's absolutely stunning! 😍 pic.twitter.com/v2xuKg6h0E
— Take One Filmy (@TakeOneFilmy) June 1, 2024