/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-14T132840.153-jpg.webp)
Kiran Abbavaram Engagement : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), నటి రహస్య గోరఖ్ నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హైదరాబాద్ లో ఓ రిసార్ట్ లో మార్చి 13న వీరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. కిరణ్ తన తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’ హీరోయిన్ రహస్య గోరఖ్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Also Read : Naga Chaitanya: ‘తండేల్’ సెట్స్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కేక్ కట్టింగ్.. ఎవరి కోసమో తెలుసా..?
కిరణ్, రహస్య ఎంగేజ్మెంట్
కిరణ్, రహస్య(Rahasya) నిశ్చితార్థ వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు కొందరు సెలెబ్రిటీలు(Celebrities) కూడా హాజరయ్యారు. ఎంగేజ్‍మెంట్ కోసం లైట్ పింక్ కలర్ కుర్తాలో కిరణ్, పీచ్ గ్రీన్ కలర్ హెవీ వర్క్ బ్లౌస్ లో రహస్య చూడముచ్చటగా కనిపించారు. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఈ జంట అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
‘రాజావారు రాణిగారు’ సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వీరి స్నేహం ప్రేమగా మారింది. గతంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ కిరణ్.. రహస్య తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది వినరో భాగ్యం విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం ‘దిల్ రూబా’ సినిమాతో పాటు 1970 వ కథనం నేపథ్యంలో ఓ పీరియాడిక్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-14-135129.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-14-135136.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-14-135156.png)
Also Read: Tovino Thomas: ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినో థామస్
Follow Us