Kiran Abbavaram Wedding : ఆ రాష్ట్రంలో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడంటే? టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్య గోరఖ్‌ని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్ - రహస్య పెళ్లి కర్ణాటకలోని కోర్గ్‌లో ఆగస్టు 22 న జరగనుంది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం.. By Anil Kumar 19 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kiran Abbavaram _ Rahasya Wedding : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేమించిన రహస్య గోరఖ్‌ని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమ వివాహం చేసుకోనున్న నేపథ్యంలో వారి వివాహం ఎక్కడ జరుగుతుందనేది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ జంట తమ వివాహాన్ని కర్ణాటకలోని కోర్గ్‌లో రహస్యంగా జరుపుకోబోతున్నారట. కిరణ్ - రహస్య పెళ్లి వ్ ఆగస్టు 22 న జరగనుంది. రహస్య బంధువులు అంతా అక్కడే ఉండటంతో పెళ్లి కూడా అక్కడే చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో సన్నిహితులకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. Also Read : ‘పుష్ప 2’ తో క్లాష్.. బన్నీకి పోటీగా బాలీవుడ్ మూవీ సినిమా ఇమేజ్‌కు భిన్నంగా కిరణ్ సింపుల్ లైఫ్‌ను ఇష్టపడే వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. ఆ విధంగానే తన వివాహాన్ని కూడా రహస్యంగానే జరుపుకోబోతున్నాడు. కాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారే. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ జంట తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఇప్ప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. #kiran-abbavaram-_-rahasya #kiran-abbavaram-wedding మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి