AP : మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై అవి ఫుల్ స్టాక్!

'ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్' అంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఏపీలో ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఉండదని, భారీగా ఈ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
AP : మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై అవి ఫుల్ స్టాక్!

Kingfisher Beer : ఏపీ (Andhra Pradesh) మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. రాష్ట్రంలో ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఉండదని, భారీగా ఈ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు టీడీపీ (TDP) సీనియర్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేస్తూ.. 'ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. జగన్ సర్కార్ నాణ్యతలేని మద్యం అమ్ముతోందని గతంలో టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే కొత్త మద్యం పాలసీ (New Liquor Policy) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : అమిత్ షాకు మళ్లీ హోంశాఖ.. కేంద్ర మంత్రుల శాఖలివే!

#Andhra Pradesh #anam-venkata-ramana-reddy #king-fisher-beer
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు