నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్

ఏంటో నియంతలు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారా అని ఆశ్యర్యపోతున్నారు. దేశాన్ని ఏడిపిస్తున్నది చాలదా నువ్వెందుకు ఏడుస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్
New Update

నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. ఉత్తర కొరియాని పీడించుకుని తింటున్నాడు. మరోవైపు ప్రపంచ దేశాలను తన మాటలతో, చేతలతో రెచ్చగొడుతుంటాడు. ఉత్తర కొరియాని అయితే మొత్తం తన అదుపాజ్ఞలలో పెట్టుకున్నాడు. నాకు నచ్చిందే చేస్తా...ఎవ్వరు చెప్పింది వినను, ఎవరి క్షేమం అక్కర్లేదు అన్నట్టుండే కిమ్ తాజాగా కన్నీరుమున్నీరు అయ్యాడు. దేశ ప్రజలతో మాట్లాడుతూ భోరున ఏడ్చాడు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏంటి కిమ్ కూడా ఏడుస్తాడా అంటూ జనాలు బోలెడు ఆశ్చర్యపోతున్నారు.

Also read:70 ఏళ్ళుగా వారు దానికి అలవాటు పడిపోయారు, జాగ్రత్త..పీఎం మోడీ పోస్ట్

ఉత్తర కొరియాలో కొంతకాలంగా జననాల రేటు తగ్గిపోతోంది. తల్లులు పిల్లలను కనడం లేదు. దీనికి సంబంధించి ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి హాజరయిన కిమ్ తల్లులతో మాట్లాడారు. దేశంలో జననాల రేటు పడిపోతోందని దాన్ని నివారించాలని..పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత అని అన్నారు. దాని కోసం ప్రభుత్వం తల్లులతో కలిసి పని చేయాలని కోరుకుంటోందని చెప్పారు. ఉత్తర కొరియాలో తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. కిమ్ మాటలు విని అక్కడ మహిళలు, తల్లులు కూడా భావోద్వేగానికి లోనయ్యారుట.

కిమ్ కన్నీరు తుడుకుంటున్న వీడియోలు ఇప్పుడు స్పెషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ వాస్తవానికి కిమ్ ఒక నియంత. ఉత్తర కొరియా ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంతో బాధపడుతోంది. దానికి కారణం అతనే. కరోనా మొదలైన నుంచి ప్రపంచంతో సంబంధం లేకుండా తమ దేశ సరిహద్దులను మూసేశారు. వాటిని ఇప్పటికీ తెరవలేదు. దీంతో అక్కడ వ్యాపారం బాగా క్షీణించింది. దీంతో అక్కడ కనీస అవసరాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో కిమ్ పిల్లలను కనండి అంటూ సలహా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

#president #crying #kim-jong-un #north-korea
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe