Breaking: జనరల్‌ సులేమాన్‌ సమాధి వద్ద ఉగ్రదాడి... 70 మంది మృతి..!

ఇరాన్ లో కెర్మాన్‌ లో హత్యకు గురైన కమాండర్‌ ఖాసేమ్‌ సులేమానీ సమాధి వద్ద జరిగిన పేలుళ్లలో 70 మంది పైగా పౌరులు మరిణించారు. సుమారు 170 మందికి పైగా జనం గాయపడినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వివరించింది.

New Update
Breaking: జనరల్‌ సులేమాన్‌ సమాధి వద్ద ఉగ్రదాడి... 70 మంది మృతి..!

ఇరాన్ (Iran) లో కెర్మాన్‌ లో హత్యకు గురైన కమాండర్‌ ఖాసేమ్‌ సులేమానీ  (Sulemani) సమాధి వద్ద జరిగిన పేలుళ్లలో 70 మంది పైగా పౌరులు మరిణించారు. సుమారు 170 మందికి పైగా జనం గాయపడినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వివరించింది. 2020 లో బాగ్దాద్‌ విమానాశ్రయంలో యూఎస్ డ్రోన్‌ దాడిలో ఇరాన్ టాప్‌ కమాండర్‌ హత్యకు గురైయ్యారు.

ఈ క్రమంలో ఆయన సమాధి వద్ద ఇరాన్‌ ప్రజలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆ ప్రదేశంలో ఉన్నవారిలో సుమారు 70 కి పైగా ప్రజలు మరణించారు. అంతేకాకుండా 170 మందికి పైగా జనం తీవ్ర గాయాలపాలైయ్యారని ఇరాన్‌ ప్రభుత్వాధికారులు వెల్లడించారు.

సోలేమాని హత్య జరిగిన తరువాత వాషింగ్టన్‌, టెహ్రన్‌ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే '' సులేమానీ సమాధి ఉన్న స్మశాన వాటిక వద్దకు వెళ్లే రహదారి పై అనేక గ్యాస్‌ డబ్బాలు వరుసగా పేలాయి. వీటిని తీవ్రవాద దాడులగా పరిగణిస్తున్నట్లు '' కెర్మాన్‌ ప్రావిన్స్‌ లోని స్థానిక అధికారి ఒకరు వివరించారు.

సులేమాని వర్థంతి సందర్భంగా అనేక మంది ఇరానియన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు 2020 లో అమెరికా సులేమానిని హత్య చేసింది.

ఆయన హత్యను నిరసిస్తూ అప్పుడే మిలియన్ల మంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ కు నాయకత్వం వహించిన ఇరాన్ కమాండర్‌ , మేజర్ జనరల్‌ ఖాసేమ్‌ సులేమానీ, తన మిత్రులతో కలిసి టార్మాక్‌ మీదుగా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు

అమెరికన్ MQ-9 రీపర్ డ్రోన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల ఆయన చనిపోయారు. సిరియాలోని డమాస్కస్ నుండి వచ్చిన తర్వాత బాగ్దాద్ విమానాశ్రయం నుండి, రష్యా మద్దతు ఉన్న బషర్-అల్ అసద్ పాలనకు ఇరాన్ మద్దతు ఇస్తోంది.

Also read: కేశినేని నాని వర్సెస్‌ కేశినేని చిన్ని..మొదలైన అన్నదమ్ముల సమరం!

Advertisment
Advertisment
తాజా కథనాలు