Telangana : కిడ్నాప్ అయిన 9 నెలల చిన్నారి సేఫ్.. నిందితురాలు అరెస్టు.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. By B Aravind 03 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 9 Months Old Child Is Safe : హైదరాబాద్(Hyderabad) లోని చంచల్‌గూడ(Chanchalguda) లో 9 నెలల పాప కిడ్నప్(9 Months Old Child Kidnap) కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ పాపను కిడ్నాప్ చేసిన మహిళను జహీరాబాద్ బస్టాండ్(Zaheerabad Bus Stand) లో పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ చిన్నారని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంలో ఆ 9 నెలల పాపను హైదరాబాద్(Hyderabad) లోని ఎంజీబీఎస్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. Also Read : ఆ స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్ ఇక వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం షాజహాన్ బేగం అనే మహిళ కేర్ టేకర్‌గా బాధిత తల్లిదండ్రుల ఇంట్లోకి వచ్చింది. వాళ్లకు ఇద్దరు కవలపిలల్లు. అయితే ఓ చిన్నారికి జ్వరం రావడంతో.. వాళ్లు ఆ పాపని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో చిన్నారిని చూసుకునేందుకు ఇంట్లో ఉన్న షాజహాన్ బేగం ఆ పాపను ఎత్తుకెళ్లింది. బాధిత తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక తమ పాప కనిపించకపోవడంతో మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిచంగా.. చివరికి నిందితురాలు ఎంజీబీఎస్(MGBS) లో పాపను తీసుకొని జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. అనంతరం ఆమెను పట్టుకుని ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు షాజహాన్ బేగం ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) కు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. Also Read : రైతులకు శుభవార్త.. మరో పదిరోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తి చేసేలా రేవంత్ ఆదేశం.. #telugu-news #telangana-news #baby-kidnap #9-months-old-child-kidnap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి