CWC Meeting: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు.

New Update
CWC Meeting: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు..

Congress Working Committee Meeting: ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఖర్గే. ఇదే సమయంలో రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర చేపడతారని ప్రకటించారు మల్లిఖార్జున ఖర్గే. తూర్పు నుంచి పశ్చిమ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉంటుందని తెలిపారు. అయితే, దీనిపై రాహుల్ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకుని వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఖర్గే. త్వరలోనే లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమిస్తామని ప్రకటించారు మల్లిఖార్జున ఖర్గే. ఇక, కాంగ్రెస్‌ 138 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఈ నెల 28న నాగ్‌పూర్‌లో భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించారు. డొనేట్‌ ఫర్‌ దేశ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేతలు సూచించారు ఖర్గే.


ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ తీర్మానం..

పార్లమెంట్ ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చిందని ఖర్గే తీవ్ర కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్‌ ప్రమాదంలో పడేసిందన్నారు. దేశ సంపదను కొందరు వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఖర్గే.

Also Read:

పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!

ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

Advertisment
తాజా కథనాలు