Khammam: ఖమ్మంలో అర్థరాత్రి ఉద్రిక్తత.. తుమ్మలతో ప్రాణాహాని ఉందంటున్న మాజీ పోలీస్ అధికారి.. ఖమ్మం పట్టణంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మాజీ పోలీస్ అధికారి బోస్ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించారు బోస్. రౌడీలు తన ఇంటికి వచ్చారన్నారు. By Shiva.K 22 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: ఖమ్మంలో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన మాజీ పోలీస్ అధికారి బోస్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు బోస్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ మేరకు ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు ఫిర్యాదు అందజేశారు. కాగా, అర్థరాత్రి వేళ బోస్ ఇంటి వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సైతం బోస్ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు. ఇరు వర్గాల మోహరింపుతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు మేరకు బోస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఎన్నికల స్క్వాడ్ బందాలు, ఐటీ అధికారులు. కాగా, బోస్ ఖమ్మం అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహించి ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్నారు. వీఆర్ఎస్ అనంతరం ఆయన.. పువ్వాడకు తన మద్ధతు ప్రకటించారు. తుమ్మలతో ప్రాణహాణి.. ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో తనకు ప్రాణ హానీ ఉందని ఆరోపించారు మాజీ పోలీస్ అధికారి బోస్. తుమ్మల ఆదేశాలతోనే తనపై దాడి చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో రౌడీ షీటర్లు తన ఇంటి వద్దకు వచ్చారన్నారు. తుమ్మల ఆదేశాల మేరకే తన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు బోస్. రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కుల మేరకు ఎన్నికల్లో ఎవరికైనా మద్దతునిచ్చే హక్కు ఉందన్నారు బోస్. పువ్వాడ కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే వారికి మద్ధతుగా నిలిచానని చెప్పారు బోస్. పోలీస్ పదవికి గుడ్ పై చెప్పి నైతిక మద్ధతు ప్రకటించానని అన్నారు. గతంలో తుమ్మల నాగేశ్వరరావు తనకు ఫోన్ చేసి బెదిరించారని, ఓటమి భయంతోనే తుమ్మల తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు బోస్. తుమ్మలతో పాటు.. ఆయన అనుచరులపైనా లీగల్‌గా ముందుకెళ్తానని చెప్పారు బోస్. Also Read: కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్.. కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు.. #telangana-news #telangana-elections-2023 #telangana-elections #telangana-politics #khammam-politics #khammam-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి