Telangana: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి..

అమెరికాలో ఇటీవల కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన వరుణ్‌ రాజ్‌(29) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వారి కుటుంబ సభ్యులకు చేరవేశారు. వరుణ్ మరణవార్త తెలియండంతో ఒక్కసారిగా వారి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

New Update
Telangana: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి..

Khammam Student Death In US: ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్‌రాజ్‌ అనే విద్యార్థి వరుణ్‌ రాజ్‌ (29) అమెరికాలో కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా అతను ఆసపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా వరుణ్ రాజ్‌ (Varun Raj) మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు చేరడంతో వారి ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి బంధుమిత్రులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఖమ్మంలోని మామిళ్ల గూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ కొంతకాలం క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు.

Also Read: కొడంగల్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపణలు

అక్టోబర్ 31న వరుణ్‌ రాజ్ జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఓ దుండగుడు వరుణ్ కణతపై పొడిచాడు. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనాస్థలానికి చేరుకొని వరుణ్‌ని ఆసుపత్రికి తరించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొన్నిరోజులుగా అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం విషమించి వరుణ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కన్నకొడుకు చనిపోయాడనే తల్లిదండ్రుల వేదనను చూసి బంధు మిత్రులు, స్థానికులు కంటతడి పెడుతున్నారు.

Also Read: గ్రూప్-1, ఇతర అభ్యర్థులకు అలర్ట్.. ఎన్నికల తర్వాతే కీలక నిర్ణయాలు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు