ఖమ్మంలో తుమ్మలకు బీఆర్ఎస్‌లో అధిష్టానం సీట్ విషయంలో షాక్ ఇవ్వడంతో ఆయన వర్గీయులు ఆందోళన చెందారు. ఏలాగైనా పాలేరులో పోటీ చేయాల్సిందేనని తన వర్గీయులు కోరారు. దీంతో బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గత వారం తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీకాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయితే తమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దూకుడు పెంచారు. నేడు పలువు బీఆర్ఎస్ నేతలతో తుమ్మల భేటీ అయ్యారు.
నాయకులకు గౌరవం లేదు
ఖమ్మం జిల్లా ప్రజలు అధికార పార్టీ బీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు బాటలో పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో మాజీ మంత్రి తుమ్మల వర్గీయులు భేటీ అయ్యారు. ఖమ్మం రూరల్ శ్రీసిటీ తుమ్మల స్వగృహంలో మూకుమ్మడిగా 500 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్చుకున్నామని మాజీ మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవం ఉంటుందని భావిస్తే.. బీఆర్ఎస్‌లో నాయకులకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. మా అందరి కోరిక మేరకు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారారని పలువురు నాయకులు తెలిపారు.
This browser does not support the video element.
సీఎం కేసీఆర్‌కు హెచ్చరిక
కొంతమంది పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయడంతోనే ఆయన ఓడిపోయారు తెలిపారు. తుమ్మల వల్లనే భూముల ధరలు పెరిగాయి. తుమ్మల నాగేశ్వరరావును పాలేరులో గెలిపించుకుంటామని ఈ ప్రాంత ప్రజలు చెపుతున్నారు. తుమ్మలకు అనుకూలంగా BRSకు రాజీనామాలు చేస్తున్నామని వారు వివరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కాబట్టి ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. కాగా గతంలో ఆయనతో పాటే ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీ మారేందుకు సిద్ధం మయ్యారు. ఈ క్రమంలో గతంలో ఆయనతో ఉన్న నేతలు పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి మరి సీఎం కేసీఆర్‌ని హెచ్చరించారు.
This browser does not support the video element.
బీఆర్ఎస్ క్యాడర్ అయోమయం
పాలేరు నియోజకవర్గంలోని తిర్మాలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన నేతలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వార్డ్ మెంబెర్స్, మాజీ పార్టీ మండలాధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ, తాజా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తుమ్మలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ వారు స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తుమ్మల వెంటే ఉంటామని వారంతా ప్రకటించారు. పాలేరులో తుమ్మల అభివృద్ధి కోసం శ్రమించారని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు పట్టించుకుంటారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఏర్పడిన ఖమ్మం జిల్లాలోని పరిణామంతో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడిపోయింది.