Khammam MP Ticket: తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. తర్వలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మొత్తం 17 స్థానాల్లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉన్న జోష్ నే లోక్ సభ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని చూస్తోంది. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ సర్వేలు కూడా చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ALSO READ: తిరిగి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి?
ఖమ్మం ఎంపీ టికెట్.. మంత్రుల మధ్య వార్.
లోక్ సభ ఎన్నికల్లో విజయం వైపు అడుగులు వెయ్యాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ తలనొప్పిగా మారింది. ఖమ్మం పార్లమెంట్ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో భట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
సోషల్ మీడియా వేదికగా..
సోషల్ మీడియాలో పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారాలు చేసుకుంటున్నారు భట్టి భార్య, పొంగులేటి సోదరుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం సీటు ఎవరకి ఇస్తుందనే దానిపై ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. సతీమణికి ఎంపీ టికెట్ కోసం భట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు పొంగులేటి లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ: విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు.. ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు
DO WATCH: