Khammam: బీజేపీ ఆశీస్సులతో కవిత జైలు బయటే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సెప్టెంబర్ 17ను విలీన దినంగానే భావిస్తాం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మం ఆయన మాట్లాడుతూ .. చరిత్రను వక్రీరించేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటే నాచెవి కోసుకుంటా అంటూ సవాల్‌ చేశారు.

Khammam: బీజేపీ ఆశీస్సులతో కవిత జైలు బయటే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
New Update

ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటే...

సెప్టెంబర్ 17ను విలీన దినంగానే భావిస్తాం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మం ఆయన మాట్లాడుతూ .. చరిత్రను వక్రీరించేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటే నాచెవి కోసుకుంటా అంటూ సవాల్‌ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పొత్తులు వేరు .. పోరాటాలు వేరు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అంటూ విమర్శించారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..

ఏపీలో వైసీపీ సైతం బీజేపీకి లొంగిపోయిందన్నారు. తెలంగాణలో సీట్ల ప్రతిపాదన కాదు.. రాజకీయ ప్రాధాన్యత కావాలన్నారు. దేశంలో ఇండియా కూటమిలాగా రాష్ట్రంలోనూ బీజేపీ వ్యతిరేక కూటమి రావాలన్నారు. తలా ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్ అధిష్టానం ముందు సీపీఐ, సీపీఎం ప్రతిపాదన చేసిందని గుర్తు చేశారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంను ఓడించడమే లక్ష్యం ఆయన దీమా వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు గతంలో మద్దతునిచ్చాను.. అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైపోయాయి.. అందులో భాగంగానే ఒంటికాలిపై నడుస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు. ముద్దబంతికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కల్పించారు. బీజేపీ ఆశీస్సులు ఉన్నంతకాలం కవిత జైలు బయటే ఉంటుందన్నారు.

బీజేపీకి జగన్ లొంగిపోయాడు...

స్కిల్ స్కాంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఓ వంద కోట్లుంటుందేమో..!! కానీ వేల కోట్లు స్కాం చేసి బెయిల్‌పై బయట ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి జగన్ లొంగిపోయాడు.. అందుకే జగన్ జైలు బయట ఉన్నాడు. తప్పు ఎవరు చేసినా తప్పే కానీ.. మూడు మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదన్నారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష్యసాధింపు జరుగుతోందని ఆయన మండి పడ్డారు. టీడీపీతో వెళ్తున్నానంటూ పవన్ బీజేపీని సంశయంలోకి నెట్టివేశారు. బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే వారికి వ్యతిరేకంగానే రాజకీయ కార్యాచరణ ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

#khammam #kavita #blessings #jail-with-bjp #cpi-national-secretary-narayana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe