Khammam Case : యాక్సిడెంట్ కాదు హత్యే.. అల్లుడే చంపేశాడు!

ఖమ్మం జిల్లాలో జరిగిన కారు ప్రమాదం కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్‌ తన భార్య కుమారితో పాటు ఇద్దరు కూతుళ్లను చంపి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Car Accident : ఖమ్మం జిల్లా (Khammam District) రఘునాథపాలెం హర్యాతండా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) కేసును పోలీసులు చేధించారు. భర్త బోడ ప్రవీణ్ కావాలనే భార్య, పిల్లలను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాడని తెలిపారు. హైదరాబాద్ లో ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ తన భార్య బోడ కుమారి (25) కుమారికి ఇంజక్షన్ ఇచ్చి, ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు కృషిక (4) కృతిక (3)లను ఊపిరాడకుండా చేసి చంపినట్లు తెలిపారు.

మరో మహిళతో వివాహేతర సంబంధం..
ఈ మేరకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన బోడ ప్రవీణ్ కు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారితో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ప్రవీణ్ కు వేరొక మహిళతో వివాహేతర సంబంధం (Extramarital Affair) ఏర్పడటంతో తరచూ కుమారిని వేధించాడని కుమారి తల్లిదండ్రులు తెలిపారు. అయితే ప్రవీణ్ తల్లి అనారోగ్యంగా ఉండటంతో పదిరోజుల క్రితం ఖమ్మం వచ్చిన ప్రవీణ్ కుమారి దంపతులు
ఆధార్ కార్డులో మార్పులు చేయించాలని మంచుకొండకు చిన్నారులతో కలిసి బయలుదేరినట్లు కుమారి పేరెంట్స్ తెలిపారు.

ఈ క్రమంలోనే తిరిగివస్తుండగా హరియాతండా మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలపై గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఘటనపై సమగ్రదర్యాప్తు చేయాలని పోలీసులకు కుమారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టు మార్టం అనంతరం వివరాలు వెల్లడించారు.

Also Read : ట్రంప్‌పై దాడి.. అమాంతం పెరిగిన క్రేజ్‌

Advertisment
తాజా కథనాలు