Expansion Of Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తిరిగి వచ్చిన వెంటనే కేబినెట్ విస్తరణ జరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న రేవంత్.. రాష్ట్రానికి రానున్నారు. అయితే ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో నాలుగు బెర్తులు భర్తీ చేసి.. రెండు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది.
Also Read: కేటీఆర్ ఇంటర్ ఫ్రెండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆయనెవరో తెలుసా?
సామాజిక సమీకరణ ప్రకారం మిగిలిన రెండు బెర్తులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర హోం, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. మరోవైపు కేబినెట్ విస్తరణ తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్లో చోటు దక్కని ముఖ్య నేతకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తనకు హోం మంత్రి పదవి పక్కా అని ప్రచారం చేసుకుంటున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవికి కన్ఫామ్ అన్న ప్రచారం సాగుతోంది
Also Read: ప్రభుత్వ పాఠశాలలో కారం అన్నం.. షాకింగ్ ఫొటో షేర్ చేసిన హరీష్ రావు!