Mahua Moitra: మహువా ఎంపీ సభ్యత్వం రద్దు వ్యవహారం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడటంతో.. ఆమె తన ఎంపీ పదనిని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అత్యు్న్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి
New Update

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామిక వేత్త హిరానందనీ నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలణలతో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తన ఎంపీ సభ్యత్వం రద్దును సుప్రీంకోర్టులో మహువా సవాలు చేశారు. అయితే సుప్రీం ధర్మాసనం ఈ విచారణను వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం, అదానీకి చెందిన సంస్థలపై ప్రశ్నలు అడిగేందుకు ఆమె పారిశ్రామిక వేత్త హిరానందనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహువాపై గతంలో ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ముందుగా పార్లమెంటులో ఆరోపణలు చేశారు. దీంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చలు జరిగాయి. అయితే ఈ వ్యవహారం ఎథిక్స్‌ కమిటీకి చేరింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహువా మొయిత్రా అనైతిక చర్యలకు పాల్పడిందని ఎథిక్స్ కమిటీ నిర్దారించింది.

Also Read: ఆరు గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం: గవర్నర్ తమిళిసై

అలాగే మహువా తనకు సంబంధించిన లాగిన్ వివరాలు హీరానందానీకి ఇచ్చినట్లు కూడా ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఇలాంటి అనైతిక చర్యకు పాల్పడినందుకు మహువాను పార్లమెంటు నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లా మహువా మోయిత్రా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 8న ఆమె తన ఎంపీ పదవిపై వేటు పడింది. అయితే ఆధారాలు లేకుండా తనపై ఎలా ఈ నిర్ణయం తీసుకుంటారని మహువా ఖండించారు.

#telugu-news #mahua-moitra #telangana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి