Amit Shah Meets Kuki Leaders : మణిపూర్ (Manipur)కు చెందిన 'ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్' (ITLF) ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది. మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర భద్రతా బలగాల మోహరింపును పటిష్టం చేయాలని.. సున్నితమైన ప్రాంతాలలో భద్రతను పెంచాలని అమిత్ షా(Amit Shah)కు మెమోరండం సమర్పించారు. హోంమంత్రి అభ్యర్థన మేరకు, జాతి హింసకు గురైన కుకీ-జో కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల మృతదేహాలను ఖననం చేయడానికి ఈ బృందం ప్రజలతో సంప్రదించి ప్రత్యామ్నాయ స్థలంపై నిర్ణయం తీసుకుంటుందని ITLF ఒక ప్రకటనలో తెలిపింది.
మణిపూర్‌లో వర్గాల హింసలో మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసే సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి 2023 ఆగస్టు 3న కేంద్రం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం నిర్వహించారు. ITLF నాయకుల అభ్యర్థన మేరకు, ప్రభుత్వ సెరికల్చర్ ఫామ్‌లోని (మణిపూర్) పరిశ్రమల శాఖ భూమిని మృతదేహాలను ఖననం చేయడానికి కేటాయించే అవకాశం ఉంది. ఈ భూమిని సాధారణ ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చినట్లు ఐటీఎల్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. చురచంద్‌పూర్ డిసితో సంప్రదించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి, మృతదేహాలను త్వరగా ఖననం చేయాలని ప్రభుత్వం కోరింది.
ఇంఫాల్‌లో ఉన్న బాధితుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. కుకీ-జో కమ్యూనిటీ బాధితుల సామూహిక ఖననం గత వారం మీటీ గ్రూపుల నిరసనలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యంతో వాయిదా పడింది. మెయిటీ గ్రూపులు ప్రతిపాదిత స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. సామూహిక ఖననం చురచంద్‌పూర్ జిల్లాలోనే జరగాలని డిమాండ్ చేశారు. అయితే తమ భద్రత గురించి కొండ ప్రాంతవాసుల భయాందోళలను గమనించిన హోంమంత్రిత్వ శాఖ..రాష్ట్రంలో అదనపు కేంద్ర భద్రతా బలగాల మోరింపును మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చింది. సమస్యాత్మక ప్రాంతాలలో ఏవైనా అవంతరాలు వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు ఐటీఎల్ఎఫ్ తెలిపింది.
భద్రతా బలగాలు, రాష్ట్రభద్రతా సలహాదారు ఆధ్వర్యంలో కొండ ప్రాంతాల్లో కేంద్రభద్రతా దళాలతో కలిసి పనిచేస్తాయని పేర్కొంది. చురాచంద్ పూర్, కాంగ్ పోక్పి, మోరే ప్రాంతాల నివాసితులు వారికి నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను త్వరగా ప్రారంభించేందుకు వీలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మే 3న మణిపూర్ లో కుకీలు, మెయిటీస్ మధ్య జాతిఘర్షణలు చెలరేగి 160మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read: ఫోకస్ అంతా మోదీపైనే…మణిపూర్ అల్లర్లపై ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ..!!