Nani VS Chinni: కేశినేని నాని వర్సెస్‌ కేశినేని చిన్ని..మొదలైన అన్నదమ్ముల సమరం!

ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల పోరు మొదలైనట్లు కనిపిస్తుంది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బుధవారం తిరువూరులో ఫ్లెక్సీలు, చింపి కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు.

New Update
Nani VS Chinni: కేశినేని నాని వర్సెస్‌ కేశినేని చిన్ని..మొదలైన అన్నదమ్ముల సమరం!

కేశినేని నాని (Kesineni Nani)  వర్సెస్‌ కేశినేని చిన్ని (Kesineni CHinni) ..అన్నదమ్ముల మధ్య వర్గపోరు ఇప్పుడు బహిరంగంగా సాగుతోంది. ఈ నెల 7న తిరువూరు (Tiruvuru) కి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (ChandraBabu Naidu) రానున్న నేపథ్యంలో కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరు కూడా తిరువూరు కి చేరుకుని ఏర్పాట్లను చూస్తున్నారు.

ఈ క్రమంలో సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేశినేని నాని ఫోటో కనిపించకపోవడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు చింపి, కుర్చీలు విరగొట్టి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌ దత్తు పై కూడా నాని వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే నాని వర్గీయులు చించిన ఫ్లెక్సీల్లో తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ చిత్రం ఉందని జనసేన కార్యకర్తలు, సైనికులు నిరసనకు దిగారు. సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న చిన్ని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగానే కాసేపటికే చిన్ని మద్దతుదారులు వేలాది మంది అక్కడికి ర్యాలీగా చేరుకున్నారు. కార్యాలయం లోపల ఉన్న కేశినేని నాని, గద్దే రామ్మోహన్‌ రావు బయటకు రావాలంటూ వారు ఆందోళనకు దిగారు. కార్యాలయం తలుపులు బాదుతూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

నాని, చిన్ని వర్గాల వారు కుర్చీలు విరగొట్టి విసురుకోవడంతో అక్కడే ఉన్న ఎస్ఐ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఎస్ఐను తీసుకుని పోలీసులు బయటకు వెళ్ళారు.

Also read: “మిస్‌ పరెఫెక్ట్‌” గా రాబోతున్న మెగా కంపౌడ్‌ చిన్నకోడలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు