కేంద్ర ప్రభుత్వానికి కేశినేని నాని లేఖ!

టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ ఏరగని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు.

New Update
కేంద్ర ప్రభుత్వానికి కేశినేని నాని లేఖ!

నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్‌ లు చేసి నిర్భందించారు. ఈ క్రమంలో టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా బాబు అరెస్ట్ ని ఖండించారు.

ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ ఏరగని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు. అసలు ఎటువంటి ప్రణాళికలను అనుసరించి ఆయనను అరెస్ట్‌ చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌ ను ఖండిస్తున్నట్లు కేశినాని తెలిపారు.

చంద్రబాబు మొదటి నుంచి కూడా తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేశారు. దేశ విదేశాల్లో ఎందరో గొప్ప వ్యక్తుల నుంచి ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ కొనియాడారు. అవినీతి మకిలి అంటని అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఈ వ్యవహారం నుంచి ఆయన ఒక స్వచ్ఛమైన తెల్లకాగితంలా బయటకు వస్తారని పేర్కొన్నారు.

జగన్‌ రెడ్డికి ఇప్పటికీ చెబుతున్నాం.. నిన్న మేం ఉన్నాం, ఇవాళ మేం ఉన్నాం, రేపు కూడా మేం ఉంటాం. రాజకీయాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం పని చేయాలే తప్ప కక్ష సాధింపు చర్యలతో ఏమి చేయలేరని హెచ్చరించారు. పోలీసు అధికారులు రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.దేశం కోసం పనిచేస్తామని మీరు ప్రమాణం చేసి ఉంటారు. ఆ మాట నిలుపుకోండి. ఒక వ్యక్తి కోసం పనిచేయడం మానుకోండి" అంటూ కేశినేని నాని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే కేశినేని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లకు లేఖ రాశారు. చంద్రబాబుని అరెస్ట్‌ చేసినప్పటి నుంచి కూడా జరిగిన విషయాలన్నిటిని కూడా వివరిస్తూ ఓ లేఖ రాశారు. వెంటనే అరెస్ట్‌ గురించి జోక్యం చేసుకోవాలని కోరారు.

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్లు ఆయన వివరించారు. ఎటువంటి సంబంధం లేని కేసుల్లో చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు