Prabhas : వయనాడ్‌ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. రూ. 2 కోట్లు..!

వయనాడ్ విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఈ విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వయనాడ్ బాధితుల కోసం రూ. 2 కోట్లు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు.

New Update
Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం

Wayanad:  కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తు యావత్ భారత దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ప్రకృతి విలయంలో వందలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తినడానికి తిండి, ఉండడానికి చోటు లేక విలవిలలాడిపోతున్నారు అక్కడి జనం. ఈ విపత్తులో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. బాధితుల కోసం తమ వంతు ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

వయనాడ్ భాదితులకు ప్రభాస్ కోటి రూపాయల విరాళం

తాజాగా టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వయనాడ్ విపత్తు భాదితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. రూ. 2కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించించారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ 25 లక్షలు, రామ్ చరణ్- చిరంజీవి 1కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కోలీవుడ్ సెలెబ్రెటీలు మోహన్ లాల్ 3 కోట్లు, సూర్య- కార్తీ 50 లక్షలు, మమ్ముట్టి - దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, రష్మిక 10 లక్షలు, ఫహద్ ఫాజిల్ 25 లక్షలను వయనాడ్(Wayanad) భాదితుల కోసం విరాళాలుగా అందించారు.

Also Read:Chiranjeevi: వయనాడ్‌ బాధితులకు అండగా మెగాస్టార్.. కోటి రూపాయల విరాళం - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు