పాలస్తీనా గ్రూప్ హమాస్ (Hamas) గాజా(Gaza) నుండి ఇజ్రాయిల్ (Izrail)పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతోంది. వందలాది మంది పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. ఈ మెరుపు దాడిలో భారిపెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో ఇజ్రాయిల్ సైనికులు, పౌరులు, ముఖ్యంగా మహిళలను హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లారు. వీరిలో కొందరు సజీవంగా ఉన్నారని, మరికొందరు చనిపోయారని భావిస్తున్నట్లు మిలిటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ తెలిపారు.
తాజాగా ఈ దాడుల్లో కేరళకు చెందిన నర్సు (Nurse) ఒకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆమె కేరళ (Kerala) లో ఉన్న తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగానే ఈ దారుణం జరిగింది. కేరళకి చెందిన నర్సు షీజా ఆనంద్(41) గత ఏడు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ లో నర్సుగా పని చేస్తున్నారు.
Also read:ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఆ రాష్ట్రాల్లో సీట్ల లెక్కలివే..!!
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను క్షేమంగానే ఉన్నానని కేరళలో ఉన్న తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆమె తన భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాంబు పేలిన భారీ శబ్ధంతో కాల్ కట్ అయ్యింది. కాసేపటి తరువాత కేరళకు చెందిన మరో వ్యక్తి షీజా కుటుంబ సభ్యులకు కాల్ చేసి ఆమె హమాస్ దాడిలో తీవ్రంగా గాయపడిందని, ప్రస్తుతానికి ఆమె కు వైద్యులు సర్జరీ చేశారని విషయాన్ని తెలియజేశారు.
ఆమెను ఇంకా మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. షీజా భర్త ఆనంద్ పుణేలో పని చేస్తుండగా పిల్లలు ఆయనతో కలిసి ఉంటున్నారు. షీజా ఇజ్రాయెల్ లో నర్సుగా పని చేస్తున్నారు. 200 మందికి పైగా కేరళకు చెందిన ప్రజలు ప్రస్తుతం బెత్లెహాంలోని ఓ హోటల్‌లో చిక్కుకుపోయారు. వారంతా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఇక కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్‌లో తలదాచుకున్నారు.