Wayanad: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..!

వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో శవాల గుట్టలు బయటపడుతున్నాయి. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మొత్తం వెయ్యి దాటే అవకాశం కనిపిస్తోంది.

Wayanad: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..!
New Update

Wayanad Landslides: వయనాడ్‌లో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఐదు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.  మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు ఏకంగా నామరూపాల్లేకుండా పోయాయి. మరోసారి కుండపోత వర్షంతో అంతా భయందోళన పరిస్థితి కనిపిస్తోంది. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

Also Read: భారత్‌కు మూడో మెడల్‌.. షూటింగ్‌లో రఫ్పాడించిన స్వప్నిల్!



అధికారికంగా మృతుల సంఖ్య 300 దాటింది. ఇంకా వందల మంది గల్లంతు అయ్యారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఆర్మీ జాగిలాలతో బాధితుల కోసం అన్వేషణ చేస్తున్నారు. వయనాడ్‌ నుంచి RTV గ్రౌండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో శవాల గుట్టలు బయటపడుతున్నాయి. మట్టిలో శవాలు పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితి.

Also Read: రెచ్చిపోయిన పోకిరీలు.. మరీ ఇంతనా.. వీళ్లను ఏం చేయాలి?

మట్టి దిబ్బలు తీస్తుండగా మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఊర్లు శవాల దిబ్బలుగా మారాయి. నదుల్లో డెడ్‌బాడీలు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ మృతదేహాల శరీర భాగాలు ఊడిపోతున్నాయి. ఘటన స్థలంలో అత్యంత భయంకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది మట్టి దిబ్బల కింద బిక్కుబిక్కుమంటూ గడిపి..ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. మొత్తం వెయ్యి మంది దాటే అవకాశం కనిపిస్తోంది.

#rtv-exclusive #wayanad-landslides #kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe