Viral Video: రెచ్చిపోయిన పోకిరీలు.. మరీ ఇంతనా.. వీళ్లను ఏం చేయాలి?
యూపీ లక్నోలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బైక్పై వెళ్తున్న జంటను చుట్టుముట్టి వారిపై నీళ్లు చల్లి వికృతానందం పొందారు. అంతేకాకుండా బైక్ను వెనక్కిలాగడంతో ఆ జంట బురదలో పడిపోయింది. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారడంతో పోకిరీల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
Lucknow Viral Video: యూపీ లక్నోలో ఆకతాయిలు రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై వెళ్తున్న జంటను చుట్టుముట్టారు కొందరు పోకిరీలు. బైక్పై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లి వికృతానందం పొందారు. అంతేకాకుండా, బైక్ను వెనక్కిలాగడంతో ఆ జంట బురదలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు పోకిరీల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.