The First Generative AI Teacher - Iris: సాంకేతిక రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం అర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ (AI) రంగం దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యోగాలను.. ఏఐ భర్తీ చేస్తుందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ, రవాణా, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ సర్వీస్, మీడియా లాంటి రంగాలతో పాటు అనేక రంగాల్లో మనుషులు చేసే పనిని.. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చేస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు వీటితో పాటు ఉపాధ్యాయ రంగంలోకి కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా కేరళలోని ఓ పాఠశాలలో ఏకంగా ఓ ఏఐ టీచర్‌ను ప్రవేశపెట్టారు.
Also Read: భారత పౌరులు మంచివాళ్లు : స్పెయిన్ గ్యాంగ్‌రేప్ బాధితురాలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ (KTCT) హైయర్ సెకండరీ స్కూల్‌లోని అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోబో టీచర్‌ను తీసుకొచ్చారు. ఆ రోబో టీచర్‌కు ఇరీస్ (Iris) అనే పేరు కూడా పెట్టారు. ఆ పాఠశాలకు చెందిన కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ (KTCT) ప్రోత్సాహంతో.. మేకర్‌ల్యాబ్స్ ఎడుటెక్ అనే సంస్థ సహాకారంతో.. ఆ పాఠశాలలో ఈ ఏఐ టీచర్‌ను ప్రవేశపెట్టారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ (ATL)లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. అయితే పాఠశాలలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టీవీస్‌ను ప్రోత్సహించేందుకు నీతీ ఆయోగ్ సంస్థ 2021లో ఈ ప్రాజెక్టును రూపొందించింది.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు
కేరళలో ఏఐ రోబో టీచర్‌ను తీసుకురావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియో చూస్తే.. చీరలో ఉన్న ఆ ఏఐ రోబో క్లాస్‌రూంలోకి వెళ్తోంది. అందులో కూర్చున్న ఓ విద్యార్థికి షేకాండ్ ఇచ్చి మాట్లాడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రోబో టీచర్.. అన్ని సబ్జెక్టులకు చెందిన కష్టతరమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పగలదు. వాయిస్ అసిస్టెంట్ సాయంతో ఈ రోబో.. విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. అలాగే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధాలిస్తుంది. వీల్స్ సాయంతో ఈ రోబో ముందుకు కదిలేలా అభివృద్ధి చేశారు.
భవిష్యత్తులో పెరగనున్న ఏఐ రోబో టీచర్లు
కేరళ విద్యా విధానంలో ఈ ఏఐ రోబో టీచర్ ఒక విప్లవమాత్మక మార్పుగా నిలవనుంది. అయితే ఈ రోబో వల్ల దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే భవిష్యత్తులో మాత్రం ఈ రోబో టీచర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ముంబయి, బెంగళూరు నగరాలతో పాటు పలు దేశాల్లో కూడా కొన్ని విద్యాసంస్థల్లో ఇలాంటి ఏఐ రోబో టీచర్‌ను అందుబాటులోకి తీసుకుచ్చారు. మరి రానున్న రోజుల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Also Read: భారత్ ఎప్పుడూ ఓ దేశం కాదు.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు