గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తుఫాను పశ్చిమ దిశగా తమిళనాడు మీదగా కదులుతుంది.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక తో పాటు అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కేరళ- మహేలోని కొన్ని ప్రాంతాల్లో అథి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
ఇటు కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఈ నెల 26 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భారీ విపత్తులు కూడా సంభవించే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు కొండ ప్రాంతాల్లో పర్యటించే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఐఎండీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సహాయక బృందాలు అలర్ట్‌గా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also read: తెలంగాణ లో ప్రియాంక ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఏంటంటే!