Kerala to Rename As Keralam: దేశంలో అక్షరాస్యత ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏదంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది కేరళ. అయితే ఇప్పుడు కేరళ పేరు కేరళంగా మారే అవకాశాలున్నాయి. తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి 'కేరళం'గా మారుస్తూ.. అసెంబ్లీలో (Assembly) ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 (Article 3) ప్రకారం.. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రానికి పేరును మార్చుకునే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పినరయి విజయన్ (Pinarayi Vijayan) ప్రభుత్వం తమ రాష్ట్ర పేరును మార్చాలని నిర్ణయించుకుంది.
Also Read: వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న!
అయితే 2023 ఆగస్టు 9న కేరళంగా పేరు మార్చాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది కేరళ సర్కార్. రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్‌లో కేరళగా ఉన్న తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరింది. అలాగే ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో కూడా కేరళంగా పేరు మార్చాలని తీర్మానంలో కేంద్రానికి సూచించింది. కానీ కొన్ని సాంకేతిక అభ్యంతరాల కారణంగా కేంద్రం నుంచి దీనికి ఆమోదం లభించలేదు. దీంతో అన్ని పరిశీనలు చేసిన తర్వాత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో సవరణ చేయాల్సిన అవసరం ఉందని కేరళ ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే కొన్ని మార్పులు చేసి ఇప్పుడు తాజాగా కొత్త తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. మళయాలంలో కేరళం అనే పేరునే వాడుతారని.. అయినప్పటికీ రాష్ట్రం పేరు అధికారిక రికార్డుల్లో కేరళ అని ఉంటుందని సీఎం పినరయ్ విజయన్ ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పేరు మార్పుకు తీర్మానాన్ని ఆమోదించామని.. తమ రాష్ట్ర పేరుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరారు.
Also Read: పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!