Minister Athishi: తీహార్ జైలులో ఉన్న ఢీల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం మీద మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటీస్ ఉన్నవారికి బెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని...ప్రస్తుతం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే వర్రీగా ఉందని అన్నారు. కేజ్రీవాల్ అంతలా బరువు తగ్గిపోవడం చూస్తుంటే ఆయన కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని అతిషి అన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. తీహార్ జైలు అధికారులు బీజేపీ పత్రాలను విడుదల చేస్తోందని ఆమె విమర్శించారు. తీహార్ జైలులో సీఎం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అయితే తీహార్ అధికారులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖకు వారు పంపిన నివేదిక ప్రకారం.. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో కేవలం 2 కిలోలు మాత్రమే తగ్గారు. కేజ్రీవాల్ ప్రాణాధారాలు నిలకడగా ఉన్నాయని, ఆయనకు సాధారణ వైద్యం మరియు ఇంట్లో వండిన ఆహారం అందించబడుతుందని స్పష్టం చేసింది.
Also Read:Cricket: లెజెండ్స్ చేసిన పనిమీద విమర్శలు..సారీ చెప్పిన భజ్జీ