Breaking : లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్!

లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్ లభించింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో హారజరైన ఆయనకు రూ.15000 బెయిల్‌ బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో రౌస్ రెవిన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి అనుమతితో కేజ్రివాల్‌ కోర్టు నుంచివెళ్లిపోయారు.

Breaking : లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్!
New Update

Delhi : లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) లో కేజ్రివాల్ కు బెయిల్ లభించింది. రూ. రూ.15000 బెయిల్‌ బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో రెవిన్యూ కోర్ట్ బెయిల్(Bail) మంజూర్ చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రివాల్‌ వెళ్లిపోయారు.

కేజ్రివాల్ స్పందించకపోవడంతో..
లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఢీల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేడు కోర్టులో హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇటీవల దర్యాప్తునకు సహకరించాలంటూ ఈడీ అధికారులు పంపిన నోటీసులకు కేజ్రివాల్ స్పందించకపోవడంతో న్యాయస్థానంలో ఈడీ ఫిర్యాదు చేసింది. దీంతో రెండుసార్లు సమన్లను రౌస్ అవెన్యూ సీబీఐ(CBI) ప్రత్యేక కోర్టు జారీ చేయగా.. తనకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టును అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. ఈ క్రమంలో కోర్టు తన విజ్ఞప్తిని అంగీకరించకపోవడంతో కోర్టు ముందు శనివారం హాజరయ్యారు ఢిల్లీ సీఎం.

ఇది కూడా చదవండి :  KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్!

ఇదిలావుంటే.. ఇప్పటికే మనిలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే 8 సార్లు నోటీసులను జారీ చేసింది ఈడీ(ED). కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరగా అనూహ్యంగా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

#delhi #liquor-scam-case #bail #kejriwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe