Arvind Kejriwal :రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.! ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. By Bhoomi 10 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. వారానికి 5సార్లు న్యాయవాదులను కలవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వారానికి రెండు సార్లు న్యాయవాదులను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అధికారులు తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఊరటనించేందుకు సరైన కారణాలు లేవని పేర్కొన్నారు. కాగా కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఈడీ వ్యతిరేకించింది. అటు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ-2021 సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచడంతో..మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అయితే తనను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడాన్ని కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కుట్రపూరితంగానే తనను అరెస్టు చేసిన మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ తరుణంలో మార్చి 28న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని ఏప్రిల్ ఒకటి వరకు పొడిగించింది. ఆ తర్వాత కేజ్రీవాల్ ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇది కూడా చదవండి: నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ భాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్! #liquor-scam #arvind-kejriwal #rouse-avenue-court #delhi-cm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి