Watch Video: అరగంట కరెంట్ నిలిపివేసినందుకు.. డీఈ సస్పెండ్

అరగంట సేపు కరెంట్ నిలిపివేసినందుకు హ‌బ్సిగూడ ప‌రిధిలోని కీస‌ర డివిజ‌న‌ల్ ఇంజినీర్ (డీఈ) ఎల్. భాస్కర్‌రావును.. తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) సంస్థ సీఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ శ‌నివారం రాత్రి సస్పెండ్ చేశారు.

New Update
Watch Video: అరగంట కరెంట్ నిలిపివేసినందుకు..  డీఈ సస్పెండ్

తెలంగాణలో ఈమధ్య కరెంట్ కోతలు ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అరగంట సేపు కరెంట్ నిలిపివేసినందుకు హ‌బ్సిగూడ ప‌రిధిలోని కీస‌ర డివిజ‌న‌ల్ ఇంజినీర్ (డీఈ) ఎల్. భాస్కర్‌రావును.. తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) సంస్థ సీఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ శ‌నివారం రాత్రి సస్పెండ్ చేశారు. అలాగే నాగారం ఆప‌రేష‌న్ అడిష‌న‌ల్ అసిస్టెంట్ ఇంజినీర్ (AEE) పై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితిల్లో లైన్ క్లియరెన్స్ (LC) తీసుకోవాలన్నా.. సర్కిల్ ఎస్‌ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.

Also read: ఆరేళ్ల పాటు మోడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి!

అయితే డీఈ భాస్కర్ రావు 33 కేవీ అమ్ముగూడ ఫీడర్‌పై పర్మిషన్ లేకుండానే ఎల్‌సీ ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం 10.05 AM - 10.35 PM వరకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. ఆ సమయంలోనే మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కరెంట్ కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే ఈ విషయం కార్పొరేట్ కార్యాలయం దృష్టికి వెళ్లడంతో దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని ఎస్‌ఈ, సీజీఎంను సీఎండీ కోరింది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా.. అరగంట సేపు విద్యుత్ సరఫరా ఆపేశారని బయటపడటంతో.. నాగారం ఏఈఈపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. వేసవిలో వినియోగదారులకు నిరంతర కరెంట్ సరఫరాకు అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌పై కార్పొరేట్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: రైల్వేశాఖ సరికొత్త ప్లాన్.. త్వరలో వందే మెట్రో

Advertisment
తాజా కథనాలు