KCR : పంటపొలాల్లోకి కేసీఆర్.. జిల్లాల వారిగా షెడ్యూల్ సిద్ధం! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. కరువు ప్రాంతాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయి అందోళన చెందుతున్న రైతులను కలవనున్నారు. మార్చి 31 నుంచి జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. By srinivas 30 Mar 2024 in Latest News In Telugu నల్గొండ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్(BRS) ఓటమి, ఆనారోగ్యం కారణంగా కొంతకాలంగా విరామంలో ఉంటున్న ఆయన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో మరోసారి యాక్టివ్ కానున్నారు. ఈ మేరకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇది కూడా చదవండి : RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..! రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు.. రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరీశీలించనున్నారు. ఆదివారం నుంచి కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీన జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారని, పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించి రైతుల(Farmers) తో నేరుగా మాట్లాడనున్నట్లు తెలిపారు. #kcr #farmers #march-31 #visit-the-state మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి