Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ లో భాగంగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా కేసీఆర్ పేరు ప్రస్తావనకు రాలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ఈడీ రిపోర్టులో కేసీఆర్ పేరు రాయలేదు. మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసీఆర్ ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు స్పష్టం చేశారు. రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేసినట్లు వెల్లడించారు. శ్రీనివాసులు రెడ్డిని కెసిఆర్ ను అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదు. రాఘవ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కెసిఆర్ అని మీడియా తప్పుగా అన్వయించింది. ఎక్కడా కూడా కెసిఆర్ పేరు రాయలేదు. వాదనల సందర్భంగా ఈడి మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. సంబంధిత వాంగ్మూల పత్రాన్ని బహిర్గతం చేశాను. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులురెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశాను. కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
This browser does not support the video element.