BRS Chief KCR: సంగారెడ్డి పేలుడు ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పేలుడువల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం ప్రకటించారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!
New Update

BRS Chief KCR: సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పేలుడువల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం ప్రకటించారు. మరిణించిన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

అసలేం జరిగింది..

హత్నూర మండలం చందాపూర్‌ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమ డైరెక్టర్‌ రవి మృతితో మరో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ALSO READ: లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా?

మరో రియాక్టర్ పేలే అవకాశం..

ఇప్పటికే కంపెనీలోని ఒక రియాక్టర్ పేలగా మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆ రియాక్టర్ పేలితే దాదాపు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలను పోలీస్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నారు. ఈ ప్రమాదం గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డీజీకి ఆదేశాలు ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

#sangareddy-accident #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe