KCR health Bulletin: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో గురువారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో బాత్ రూంలో కాలుజారి పడిపోయారు. ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తీసుకుని వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముక లైట్ గా ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.
తాజాగా ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ చేసి తుంటి విరిగినట్లు వైద్యులు వివరించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సర్జరీ చేసిన తరువాత కేసీఆర్ 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
Also read: త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటున్న *హాయ్ నాన్న* అమ్మడు!