KCR:యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. యశోదలో డిసెంబర్ 8న ఆయనకు తుంటి మార్పిడి సర్జరీ జరిగింది. దీని నుంచి కోలుకున్న కేసీఆర్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. By Manogna alamuru 15 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR Discharged from Yashoda: వారం క్రితం జారిపడడంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయన యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. డిసెంబర్ 8న ఆయనకు అక్కడ వైద్యులు తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకున్నారు. వాకింగ్ స్ట్రెచర్ తో కొద్దికొద్దిగా నడుస్తున్నారు. దీంతో వైద్యులు కేసీఆర్ ను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి కేసీఆర్ నందినగర్ లోని తన నివాసానికి వెళ్ళనున్నారు. కానీ వైద్యులు కేసీఆర్ ఆరువారాలపాటూ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. Also Read: నేటీ నుంచి జీరో టికెట్లు జారీ.. గుర్తింపు కార్టు లేకుంటే నో టికెట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజా భవన్(ప్రగతి భవన్) నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని తన ఫామ్‌కు వెళ్లారు కేసీఆర్. అయితే, అక్కడ బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. దాంతో ఆయన్ను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో కేసీఆర్ తుంటి వెముక విరిగిపోగా.. ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటుంది. కేసీఆర్‌కు ప్రస్తుతం ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉందని వైద్యులు చెప్పారు. డైట్ కూడా మామూలుగానే తీసుకుంటున్నారని వెల్లడించారు. అంతేకాదు.. త్వరగా కోలుకునేందుకు అవసరమైన వ్యాయామాలు కూడా చేస్తున్నారని తెలిపారు. Your browser does not support the video tag. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత కేసీఆర్ నేరుగా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కే వెళ్తారని అంతా భావించారు. కానీ, ఆయనకు వైద్యుల పర్యవేక్షణ అవసరం అని చెబుతున్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎర్రవెల్లికి వెళ్లడం సరికాదని, అందుకే.. హైదరాబాద్‌లోనే ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నందినగర్‌లో ఉన్న తన ఇంటికే వెళ్లాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. #brs #kcr #yashoda-hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి