KCR demanded PM Modi to give Bharat Ratna to Annabhau Sathe: ‘మహా’రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. గత కొంత కాలంగా మహారాష్ట్రలో ఆయన వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా ఆయన మహారాష్ట్రలో పర్యటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మొదట ఆయన కొల్లాపూర్ అంబ బాయి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో పర్యటించారు. అక్కడ ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావ్ సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అన్నాభావ్ సాఠే విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించారు.
అనంతరం కొల్హాపూర్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... అణగారిన వర్గాల కోసం అన్నాభావ్ సాఠే గొంతెత్తి పాడారని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర యుగకవి అన్నాభావ్ సాటేకు భారత రత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ సర్కార్ కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు. రష్యా వంటి దేశం కూడా అన్నా భావ్ సాఠేను గుర్తించిందన్నారు. కానీ మన దేశంలో ఆయన్ని గుర్తించకపోవడం శోచనీయమన్నారు.
కొల్హాపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... అణగారిన, పీడిత ప్రజల తరఫున అన్నాభావ్ సాఠే నిలిచారని అన్నారు. అన్నాభావ్ రచనలు ఏ ఒక్క వర్గానికే పరిమితం కాలేదన్నారు. ఆయన రచనలు మరాఠీలో మాత్రమే అందుబాటులో వున్నాయని, వాటిని ఇతర భాషల్లో కూడా ప్రచురించాలన్నారు. ఆయన గ్రంథాలు వెలుగులోకి వస్తే దేశానికే గర్వకారణమన్నారు.
రష్యా గ్రంథాలయాల్లో అన్నాభావ్ విగ్రహాలు పెట్టారని చెప్పారు. అన్నాభావ్ ను ఇండియన్ మ్యాక్సిమ్ గోర్కీ అని ప్రశంసించదన్నారు. రష్యా లాంటి దేశాలు గుర్తించి నేతను భారత్ గుర్తించకపోవడం శోచనీయమన్నారు. అన్నాభావ్ లాంటి వ్యక్తిని గౌరవిస్తే దేశానికి గౌరవం లభిస్తుందన్నారు. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలన్నారు. దీనికి తెలంగాణ కూడా మద్దతు తెలుపుతుందన్నారు.
Also Read: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా ఏమంటున్నారంటే