మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. అన్నాభావ్ ను రష్యా గుర్తించినా... భారత్ పట్టించుకోలేదు...!
అన్నాభావ్ సాఠేకు భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ, దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డ, అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు.